మృదువైన పెదాలు సొంతమిలా!
చలికాలంలో పెదాలు పొడిబారి, చర్మం పొట్టులా వూడిపోతుంది. ఈ సమస్యల్ని నివారించి.. మృదువైన పెదాలు సొంతం చేసుకోవాలంటే కొన్ని నియమాలు పాటించాలి!
* కొబ్బరినూనె: కొందరికి పగుళ్లు ఎక్కువైనప్పుడు పెదాలు దురదగా అనిపిస్తాయి. అలాంటప్పుడు రాత్రిపూట ఓ పదినిమిషాల పాటు గోరువెచ్చని కొబ్బరినూనెతో మర్దన చేయాలి. దీంతో దురద తగ్గుతుంది. మర్నాటికి పెదాలు తాజాగా కనిపిస్తాయి.
* తేనె: టాన్ చేరడం వల్ల పెదాలు నల్లగా మారతాయి. అలాంటి వారు తేనెతో మర్దన చేసుకోవాలి. వీలైతే కాస్త పంచదార కూడా అద్ది మృదువుగా మర్దన చేసి గోరువెచ్చటి నీళ్లతో కడిగేయాలి. దీనివల్ల టాన్ వదిలిపోయి పెదాలు తాజాగా మారతాయి.
* నెయ్యి: నెయ్యి కూడా పెదాలను మృదువుగా మారుస్తుంది. పడుకునే ముందు నెయ్యితో పెదాల మీద రాసి కాసేపు మసాజ్ చేస్తే మంటా, నొప్పీ తగ్గుతాయి. పగుళ్లు బాధించవు.
No comments:
Post a Comment