ఆశావహుల్లోనే ఆరోగ్యం ..!
ఏనాడూ వెనుదిరక్కుండా, మునుముందుకే సాగిపోయే సూర్యుణ్ని, సమస్త మాన వాళి అనుసరించాలంటారు ఆధ్యాత్మిక బోధకుడు దలైలామా. అభ్యుదయం ఒక్కటే ఆకాంక్షగా, అనుక్షణం, ఆశావహంగా ఉండడంలో మానసిక ఆనందమే కాదు. శారీరక ఆరోగ్యం కూడా సిద్ధిస్తుందన్నది పలు పరిశోధనల్లో స్పష్టమైన అంశం. ఎందుకంటే, ఆశావహులు సరైన వేళకు సరైన భోజనం చేస్తారు. రోజూ వ్యాయామం చేస్తారు. తమకు సంబంధించిన అన్ని విషయాల్లోనూ చాలా జాగ్రత్తగా ఉంటారు. ప్రతి దాంట్లో ఉండే మంచిని ఆస్వాదించే మానసిక స్థితి కూడా వీరిలో ఎక్కువని పరిశోధకులు అంటున్నారు. నిరాశా వాదులు ఈ విషయాలన్నింటిలోనూ నిర్లక్ష్యంగా ఉండిపోతారు. హార్వర్డ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ వారు ఇటీవల జరిపిన తమ పరిశోధ నల ఆధారంగా నిరాశావహులతో పోలిస్తే, ఎప్పుడూ ఉల్లాసంగా, సంతోషంగా ఉండే వారికి గుండెపోట్లు, పక్షవాతం వంటి సమస్యలు తక్కువగానూ, శరీరానికి మంచి చేసే హెచ్‌డిఎల్ కొలెసా్ట్రల్ ఎక్కువగానూ, హానికారకమైన ట్రైగ్లిసరైడ్స్ తక్కువగానూ ఉంటున్నట్లు చెబుతున్నారు. అన్నింటినీ మించి నిరాశావంతులతో పోలిస్తే, ఎక్కువ ఉల్లాసవంతంగా ఉండే వారి రక్తంలో కేన్సర్‌తో పోరాడే కెరోటెనాయిడ్స్ ఎక్కువగా ఉంటున్నట్లు వారు కనుగొన్నారు. కేవలం రోజూ ఉదయం సూర్యుణ్ని చూడటంతో పాజిటివ్ తత్వం, అవకాశాలను అందిపుచ్చుకునే వైఖరి పెరుగుతుందని పరిశోదకులు మరీ మరీ చెబుతున్నారు. ఏ ఖర్చూ లేకుండా, కేవలం విషయాల్ని పాజిటివ్‌గా చూసే తత్వాన్ని పెంచుకున్నంత మాత్రాన అంత ఆనందం, ఆరోగ్యం ఉంటే అసలెవరైనా మరో రకంగా ఆలోచిస్తారా..?

No comments:
Post a Comment