ఒక్క కాఫీతో రోజంతా ఖుషీ!
• గంటల తరబడి కెఫీన్‌ను విడుదల చేసే స్పటికల రూపకల్పన
అనుదినమ్ము కాఫీయే అసలు కిక్కు... కొద్దిగానైన పడకున్న పెద్దచిక్కు... కప్పు కాఫీ పొందుటే లక్కు'' అని కాఫీ దండకం ఎత్తుకుంటున్నారు పరిశోధకులు! ఒకే ఒక్క కప్పు కాఫీతో రోజంతా శక్తిని, ఉల్లాసాన్ని పొందేలా స్విట్జర్‌లాండ్‌లోని యూనివర్సిటీ ఆఫ్ జ్యూరిచ్, లౌసన్నెలోని నెస్లె రీసెర్చ్ సెంటర్‌కు చెందిన పరిశోధకులు ఈ సరికొత్త ఫార్ములా కనిపెట్టారు. కాఫీని తాగ్గానే.. అందులోని కెఫీన్ ప్రభావం ఒక్క ఉదుటను శరీరంలోకి చొచ్చుకుపోయి కండరాలను, మెదడును ఉత్తేజపరుస్తుంది. దీంతో అనుకూలమైన, చురుకైన ఆలోచనలు మెరుస్తాయి.
బావుందిగానీ.. మళ్లీమళ్లీ కాఫీ కావాలని మనసు అల్లరిచేస్తుంది! ఈ పరిస్థితి లేకుండా ఒక్కసారి కాఫీ తాగితే శరీరానికి మెల్లిగా, స్థిరంగా కొన్ని గంటలపాటు కెఫీన్‌ను అందించే లిపిడ్ మాలిక్యుల్ సూక్ష్మ స్పటికలను రూపొందించారు. ఇవి కడుపులో నీటితో కిలిసి, దశలవారీగా కెఫీన్‌ను విడుదల చేస్తాయి.
No comments:
Post a Comment