Flag Counter

Saturday, September 10, 2016

GET INSTANT ENERGY WITH MIXED FRUIT JUICE - FRUIT JUICE MAKING TIPS


శక్తినిచ్చే పండ్ల పానీయం

కావల్సినవి:
కాచిన పాలు - కప్పు, అరటిపండు - ఒకటి, యాపిల్‌ - ఒకటి, సపోటాలు - నాలుగు, బత్తాయిలు - రెండు (రసం తీసుకోవాలి), జీడిపప్పు, బాదం - పది చొప్పున(ముందుగానే నానబెట్టుకోవాలి), తేనె - ఎనిమిది చెంచాలు, వెనిల్లా ఎసెన్సు - రెండుమూడు చుక్కలు, వెనిల్లా ఐస్‌క్రీం - సరిపడా. 

తయారీ:
అరటిపండు, యాపిల్‌ సపోటాలను చిన్నచిన్న ముక్కల్లా చేసుకుని మిక్సీలో వేసుకోవాలి. ఆ తరవాత పాలుచేర్చి మరోసారి మిక్సీ తిప్పాలి. నానిన జీడిపప్పు, బాదంపలుకుల్లో సగం తీసుకుని విడిగా మెత్తని మిశ్రమంలా చేసి అరటిపండు జ్యూస్‌కి కలపాలి. అందులో తేనె, బత్తాయిరసం, వెనిల్లా ఎసెన్సు వేశాక.. గ్లాసులో ముప్పావు వంతు తీసుకోవాలి. పైన వెనిల్లా ఐస్‌క్రీం వేసి.. పైన మిగిలిన బాదం, జీడిపప్పు పలుకులు చేర్చి అలంకరిస్తే సరిపోతుంది. పసందైన పానీయం సిద్ధం.

No comments:

Post a Comment