Flag Counter

Saturday, February 6, 2016

RULES TO FOLLOW TO REDUCE OBESITY


పురుషుల్లో ఊబకాయంను తగ్గించే లైఫ్ స్టైల్ రూల్స్
అధికంగా ద్రవాలు తీసుకోవాలి: రోజులో అధికంగా ద్రవాలు తీసుకోవాలి. ద్రవాలలో సిట్రస్ జ్యూసులు మరియు వాటర్ ఇవి పొట్టను ఫుల్‌గా నింపడం మాత్రమే కాదు, ఇది మీరు ఎక్కువగా ఆహారం తీసుకోనివ్వకుండా మరియు బరువు పెరగకుండా కంట్రోల్ చేస్తుంది. - స్టెప్స్ ఎక్కాలి: ఆఫిసుల్లో, ఇతర బయట ప్రదేశాల్లో లిప్ట్స్, ఎలివేటర్స్‌ను ఉపయోగించకుండా స్టెప్స్ ఎక్కడం ఆరోగ్యకరం. స్టెప్స్ ఎక్కడం సులభం మరియు బరువును కంట్రోల్లో ఉంచుకోవడానికి ఇది ఒక ఉత్తమ మార్గం. దాంతో ఊబకాయంను తగ్గించుకోవచ్చు. - ఆకలితో ఉండకూడదు: పొట్ట ఎప్పుడూ ఆకలితో ఉండకూడదు. ఇలా ఉండటం వల్ల తర్వాత భోజనంలో ఎక్కువ ఆహారాన్ని తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ చెడు అలవాటు వల్ల మరింత లావుగా మరియు బరువుగా కనబడుతారు. - మీరు ఏం తింటున్నారో గమనించాలి: మహిళలు ఆరోగ్యం మీద, స్లిమ్ బాడీ మీద ఏకాగ్రతతో ఎలాంటి ఆహారం నియమాలు పాటిస్తారో, అదే విధంగా పురుషులు కూడా కొన్ని ఆహార నియమాలు పాటించడం ద్వారా మంచి ఆరోగ్యాన్ని పొందడంతో పాటు, ఊబకాయ సమస్యలుండవు. - డిన్నర్ రూల్స్ పాటించాలి: డిన్నర్ రూల్స్ స్ట్రిక్ట్‌గా ఫాలో అవ్వాలి. 7 గంటల తర్వాత డిన్నర్ చేయకూడదు. ఈ రూల్ పాటించండం వల్ల శరీరంలో అదనపు క్యాలరీలు ధరిచేరవు మరియు ఎక్కువ ఆహారం తీసుకోవాలనిపించదు. దాంతో ఊబకాయ సమస్యలు ఉండవు.

No comments:

Post a Comment