chitika

Saturday, September 10, 2016

GET INSTANT ENERGY WITH MIXED FRUIT JUICE - FRUIT JUICE MAKING TIPS


శక్తినిచ్చే పండ్ల పానీయం

కావల్సినవి:
కాచిన పాలు - కప్పు, అరటిపండు - ఒకటి, యాపిల్‌ - ఒకటి, సపోటాలు - నాలుగు, బత్తాయిలు - రెండు (రసం తీసుకోవాలి), జీడిపప్పు, బాదం - పది చొప్పున(ముందుగానే నానబెట్టుకోవాలి), తేనె - ఎనిమిది చెంచాలు, వెనిల్లా ఎసెన్సు - రెండుమూడు చుక్కలు, వెనిల్లా ఐస్‌క్రీం - సరిపడా. 

తయారీ:
అరటిపండు, యాపిల్‌ సపోటాలను చిన్నచిన్న ముక్కల్లా చేసుకుని మిక్సీలో వేసుకోవాలి. ఆ తరవాత పాలుచేర్చి మరోసారి మిక్సీ తిప్పాలి. నానిన జీడిపప్పు, బాదంపలుకుల్లో సగం తీసుకుని విడిగా మెత్తని మిశ్రమంలా చేసి అరటిపండు జ్యూస్‌కి కలపాలి. అందులో తేనె, బత్తాయిరసం, వెనిల్లా ఎసెన్సు వేశాక.. గ్లాసులో ముప్పావు వంతు తీసుకోవాలి. పైన వెనిల్లా ఐస్‌క్రీం వేసి.. పైన మిగిలిన బాదం, జీడిపప్పు పలుకులు చేర్చి అలంకరిస్తే సరిపోతుంది. పసందైన పానీయం సిద్ధం.

MAKING OF PUDINA JUICE FOR GOOD HEALTH


పుదీనా రసం

కావల్సినవి:పుదీనా రసం- రెండు చెంచాలు, నిమ్మరసం- చెంచా, ఉప్పు- రుచికి తగినంత, జీలకర్ర పొడి- అర చెంచా(వేయించాలి), మిరియాల పొడి- అరచెంచా.

తయారీ: గ్లాసుడు నీళ్లలో పైన తెలిపిన పదార్థాలన్నింటినీ కలిపి చల్లగా తీసుకొంటే రుచిగా ఉంటుంది.

EATING DAILY EGG GIVES LIFE LONG HEALTH PROTECTION


ఉదయం పూట తినే అల్పాహారంలో 

ఒక గుడ్డుని చేర్చుకుంటే ఎంతో మేలు. దానివల్ల మాంసకృత్తులు అందడమే కాదు

.. రోజంతా చురుగ్గా ఉంటాం. సగటున గుడ్డు నుంచి ఆరు గ్రాముల ప్రొటీన్లు, 72 కెలొరీలు

అందుతాయి. మాంసకృత్తులతోపాటూ మరికొన్ని పోషకాలు అందించే గుడ్డు బరువు 

తగ్గాలనుకునేవారికి మంచి ఆహారం. అందుకే రోజులో ఒక ఉడికించిన గుడ్డుని తింటే 

చాలు.

chitika